Tollywood: దసరాకు థియేటర్/ఓటీటీలో వచ్చే సినిమాలివే!
ఈ వారం విడుదలవుతున్న చిత్రాల వివరాలు
దసరాకి అగ్రహీరోలు ఎవరూ బరిలో లేరు. కరోనా ప్రభావం తగ్గినా, ప్రేక్షకుల థియేటర్లకి వచ్చేందుకు సుముఖంగా లేరు. అందుకే ఈ పండగకి స్టార్ల హీరోల మెరుపులు కరవయ్యాయి. కుర్ర హీరోలు మాత్రం వసూళ్ల వేటలో సై అంటూ రంగంలోకి దూకుతున్నారు. దీంతో సినిమా హాళ్లలో యువహీరోల మధ్య పండగ పోటీ ఉండబోతుంది. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో పలకరించేందుకు సిద్ధమైన చిత్రాలేంటో చూద్దాం.
మహా సముద్రం
లోతు కొలవలేనంత ప్రేమ ‘మహా సముద్రం’లో ఉందంటున్నారు హీరోలు సిద్ధార్థ్, శర్వానంద్. వాళ్లిద్దరూ స్నేహితులుగా నటిస్తున్న చిత్రమిది. అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లు. ‘ఆర్‌ఎక్స్100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రావు రమేశ్, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానుంది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ, అఖిల్‌కి సరైన హిట్ పడలేదు. ఈ సారి మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాననే ధీమాతో ఉన్నాడీ అక్కినేని హీరో. అఖిల్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. అక్టోబరు 15న దసరా పండగ కానుకగా విడుదలవుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకుడు. గోపిసుందర్ అందించిన బాణీలు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.
పెళ్లిసందD
సీనియర్ నటుడు శ్రీకాంత్‌కి ‘పెళ్లిసందడి’ మైలురాయిలాంటి సినిమా. ఇప్పుడు అదే టైటిల్‌తో ఆయన తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లిసందD’ సినిమా చేస్తున్నారు. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కింది. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది కూడా దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో వచ్చిన ‘పెళ్లిసందడి’ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి ఈ సినిమాకు కూడా పనిచేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్
ఓటీటీలో అలరించనున్న చిత్రాలు
సర్దార్ ఉద్దమ్
విక్కీ కౌశల్ కీలక పాత్రలో సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్’. విక్కీ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. జలియన్ వాలాబాగ్ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్ డయ్యర్‌ను విప్లవకారుడైన ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్ సిర్కార్‌లు ‘సర్దార్ ఉద్దమ్’ తెరకెక్కించారు.
రష్మీరాకెట్
‘థప్పడ్’, ‘హసీనా దిల్‌రుబా’, ‘అనబెల్ సేతుపతి’.. ఇలా వరుస ఓటీటీ రిలీజ్‌లతో దూసుకెళ్తున్నారు నటి తాప్సీ పన్ను. తాజాగా ‘రష్మీరాకెట్’తో ఓటీటీ వేదికగా మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ గుజరాత్ అథ్లెట్ రష్మీ పాత్రలో కనిపించనున్నారు. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోనీ స్ర్కూవాలా, నేహా, ప్రంజల్ సంయుక్తంగా నిర్మించారు.
నెట్‌ఫ్లిక్స్
* ది ఫోర్ ఆఫ్ అజ్ - అక్టోబరు 15
* ది ట్రిప్ - అక్టోబరు 15
* లిటిల్ థింగ్స్ - అక్టోబరు 15
* యు - అక్టోబరు 15
అమెజాన్ ప్రైమ్
* రక్తసంబంధం - అక్టోబరు 14
* ఫ్రెండ్‌షిప్ - అక్టోబరు 15
* ఐనో వాటు యు డిడ్ లాస్ట్ సమ్మర్ - అక్టోబరు 15
డిస్నీ ప్లస్‌హాట్ స్టార్
* సీటీమార్ - అక్టోబరు 15
* ఫ్రీ గై - అక్టోబరు 15
* సనక్ - అక్టోబరు 15
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!
-
Sports News
PCB: పీసీబీ నిర్ణయం.. పాక్ క్రికెట్ వ్యవస్థకు ఎదురుదెబ్బ: మిస్బాఉల్ హక్
-
Crime News
Bull Race: ఎడ్ల పందేలకు అనుమతివ్వలేదని..వాహనాలపై రాళ్ల వర్షం