Ravi Teja: యాక్షన్‌ బచ్చన్‌

'మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు

Updated : 18 Jun 2024 09:33 IST

'మిస్టర్‌ బచ్చన్‌’గా సినీప్రియుల్ని పలకరించనున్నారు రవితేజ. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాని హరీశ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం నుంచి షో రీల్‌ పేరుతో ఓ వీడియో గ్లింప్స్‌ విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఒక్క డైలాగ్‌ లేకున్నా.. రవితేజ ఆద్యంతం మాస్‌ యాక్షన్‌ హంగామాతో అలరించారు. ఆయన ఇందులో నిజాయతీ గల ఆదాయపన్ను అధికారిగా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. తను ఓ రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్‌కు వెళ్లాక ఏం జరిగిందనే ఆసక్తికర అంశంతో ఈ సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఆఖర్లో అమితాబ్‌ కటౌట్‌ ముందు ఆయన్ని అనుకరిస్తూ రవితేజ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జె.మేయర్, ఛాయాగ్రహణం: అయనంక బోస్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని