mr pregnant ott release: సోహైల్‌ ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’.. ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించడానికి మరో సినిమా సిద్ధమైంది. సోహైల్‌ కథానాయకుడిగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ తేదీ తాజాగా వెలువడింది.

Published : 28 Sep 2023 17:32 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ షోతో ప్రేక్షకులకు చేరువయ్యారు నటుడు సోహైల్‌ (Sohel). ఆయన హీరోగా నటించిన విభిన్న కథా చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వం వహించారు. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. ఆగస్టు 18న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా యువత నుంచి మంచి స్పందన సొంతం చేసుకుంది. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబర్‌ 6 నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

విజయ్‌ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్‌: రష్మిక

కథేంటంటే: గౌతమ్(సోహెల్) ఓ టాటూ ఆర్టిస్టు. అనుకోని పరిస్థితుల్లో మహి (రూప)తో అతడికి వివాహం అవుతుంది. తల్లిదండ్రులను ఎదిరించి వచ్చిన ఆమెను కాలు కిందపెట్టకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఈ క్రమంలో మహికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. ఆ విషయం గౌతమ్‌కు నచ్చదు. తనకు గతంలో జరిగిన సంఘటన వల్ల మహి ఎక్కడ దూరమవుతుందోనని మదనపడుతుంటాడు. ఆమె గర్భాన్ని తాను తీసుకోవాలనుకుంటాడు. సైంటిఫిక్‌గా కొన్ని దేశాల్లో అది సాధ్యపడటంతో డాక్టర్ వసుధ(సుహాసిని)ని ఒప్పించి ఆ గర్భాన్ని గౌతమ్ మోస్తాడు. ఆ తర్వాత ఏమైంది? గౌతమ్ బిడ్డను కన్నాడా? అతడి జీవితంలో జరిగిన గత సంఘటనలేంటీ? గర్భాన్ని మోసిన గౌతమ్‌ను సమాజం ఎలా చూసిందనేదే మిస్టర్ ప్రెగ్నెంట్ కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు