Cinema News: మృణాల్, వరుణ్‌ల లవ్‌స్టోరీకి సన్నాహాలు?

కథల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపించే అందాల తార మృణాల్‌ ఠాకూర్‌.. బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌తో ఓ సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే.

Published : 10 Jul 2024 01:04 IST

థల ఎంపికలో తనదైన ప్రత్యేకతను చూపించే అందాల తార మృణాల్‌ ఠాకూర్‌.. బాలీవుడ్‌ కథానాయకుడు వరుణ్‌ ధావన్‌తో ఓ సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న ఈ రొమాంటిక్‌ ప్రేమకథను డేవిడ్‌ ధావన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను ఈ నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనులు ముగింపు దశలో ఉన్నాయి. ఈ నెల 12 నుంచి ముంబయిలో షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఇందులోని తన పాత్ర కోసం కసరత్తులు కూడా ప్రారంభించాడు వరుణ్‌. ఈ రొమాంటిక్‌ ప్రేమకథలో మరో కథానాయికగా నటించడానికి శ్రీలీలతో చర్చలు జరుపుతోంది చిత్రబృందం. త్వరలో దీని గురించి అధికారికంగా ప్రకటించనున్నార’’ని వరుణ్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం జాన్వీతో కలిసి ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ చిత్రీకరణలో ఉన్నారు వరుణ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని