నటినని.. నా ప్రియుడు నన్ను వదిలి పారిపోయాడు..!

బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి ‘సూపర్‌ 30’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఆమె తన తదుపరి చిత్రం ‘జెర్సీ’ విడుదల కోసం సిద్ధంగా ఉన్నారు. షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన

Published : 13 Feb 2022 01:18 IST

షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన ‘జెర్సీ’ నటి

ముంబయి: బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించి ‘సూపర్‌ 30’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌. ప్రస్తుతం ఆమె తన తదుపరి చిత్రం ‘జెర్సీ’ విడుదల కోసం సిద్ధంగా ఉన్నారు. షాహిద్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈసినిమాపై తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన లైఫ్‌ స్టైల్‌, బ్రేకప్‌పై స్పందించారు. టీనేజీలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో తాను మానసిక కుంగుబాటుకు లోనయ్యానని అన్నారు. అంతేకాకుండా అప్పుడప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా తనని వెంటాడేవని ఆమె తెలిపారు.

‘‘టీనేజీలో ఉన్నప్పుడు నాకు ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. పెళ్లి, పిల్లలతో కాకుండా కెరీర్‌పరంగా ఉన్నత స్థాయిలో ఉండాలనేది నా కోరిక. అందుకు అనుగుణంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు అడుగులు వేశా. నటిగా మీ అందరి అభిమానాన్ని పొందుతున్నా’’ అని చెప్పారు. అనంతరం తన లవ్‌స్టోరీపై స్పందిస్తూ.. ‘‘జీవితభాగస్వామిని పొందే క్రమంలో ఎంతో మంది వ్యక్తులు మనం జీవితంలోకి వస్తుంటారు. వాళ్లు మనకి సరిపోతారా?లేదా?అనేది మాత్రం మనం నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. వాళ్లు మనకి నప్పరు అనుకున్నప్పుడు విడిపోక తప్పదు. సుమారు 7 నెలల క్రితం నాకొక బ్రేకప్‌ జరిగింది. నేను ప్రేమించిన వ్యక్తి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు. పద్ధతులు, కట్టుబాట్లు ఫాలో అవుతాడు. మేమిద్దరం ఇష్టపడ్డాం.. కాకపోతే, నేను నటినని అతను నన్ను వదిలి పారిపోయాడు. అతనిపై నాకు ఎలాంటి కోపం లేదు. ఎందుకంటే, ఇప్పుడు మేమిద్దరం సర్ది చెప్పుకొని రిలేషన్‌ ముందుకు తీసుకువెళ్లినా, మాకు పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్లని పెంచే సమయంలో మా మధ్య గొడవలు రావొచ్చు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని