సంద‌డి చేస్తోన్న ‘ముగ్గురు మొన‌గాళ్లు’

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గ‌రు మొన‌గాళ్లు’. అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. క‌ళ్లు క‌నిపించని, చెవులు వినిపించ‌ని, మాట్లాడ‌లేని ముగ్గురు వ్యక్తుల క‌థ ఇది.

Updated : 25 May 2021 14:29 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గ‌రు మొన‌గాళ్లు’. అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌లైంది. క‌ళ్లు క‌నిపించని, చెవులు వినిపించ‌ని, మాట్లాడ‌లేని ముగ్గురు వ్యక్తుల క‌థ ఇది. శ్రీనివాస్‌, దీక్షిత్‌, రామారావు త‌మ త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయి న‌వ్వులు పూయిస్తున్నారు. స‌ర‌దాగా సాగుతూనే ఓ మిస్ట‌రీ కేసు అంశంతో ఉత్కంఠ పెంచుతోంది ఈ ట్రైల‌ర్‌. మ‌రి ఆ హ‌త్య కేసు ఏంటి? వీళ్ల‌కి దానికి సంబంధం ఏంటి?  పోలీసులు ఈ అమ‌యాకుల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? త‌దిత‌ర ఆస‌క్తికర విష‌యాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమాలో రాజా ర‌వీంద్ర, దివంగ‌త న‌టుడు టీఎన్ఆర్  కీల‌క పాత్రలు పోషించారు. చిత్ర మందిర్ స్టూడియోస్ ప‌తాకంపై  అచ్యుత్ రామారావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి  సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు