Mukesh Khanna: రూ.300 కోట్లతో ‘శక్తిమాన్’ సినిమా.. వెల్లడించిన ముఖేశ్ ఖన్నా
‘శక్తిమాన్’ ప్రాజెక్ట్ గురించి నటుడు ముఖేశ్ ఖన్నా (Mukesh Khanna) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలు వెలువడనున్నట్లు చెప్పారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘శక్తిమాన్’ (Shaktimaan).. 90ల్లో పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్ర ఇది. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి అతడు వస్తాడని అప్పట్లో చిన్నారులు నమ్మేవాళ్లు. అంతలా ప్రజాదరణ పొందిన ఈ ధారావాహిక రాను రాను కనుమరుగైపోయింది. అయితే, ‘శక్తిమాన్’ కథతో సినిమా సిద్ధమవుతుందని నటుడు ముఖేశ్ ఖన్నా (శక్తిమాన్ పాత్రధారి) గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా ముఖేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బడ్జెట్, నిర్మాణ సంస్థ వివరాలను వెల్లడించారు. ‘‘కరోనా మహమ్మారి కారణంగా మా ప్రాజెక్ట్ ఆలస్యమైంది. ‘స్పైడర్‌మ్యాన్’ను నిర్మించిన సోనీ పిక్చర్స్ సంస్థ మా చిత్రాన్ని నిర్మిస్తోంది. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇది రూపుదిద్దుకోనుంది. ఇందులో నేనూ నటిస్తున్నాను. కాకపోతే నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. ప్రస్తుతానికి నేను ‘శక్తిమాన్’ గెటప్‌లో పబ్లిక్‌లోకి రావడానికి అవకాశం లేదు. ఇక, ఈ సినిమాలో ప్రధాన పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఎవరు దీనికి దర్శకత్వం వహించనున్నారు? అనే విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది’’ అని ఆయన తెలిపారు.
దూరదర్శన్ వేదికగా 1997 నుంచి 2005 వరకూ ‘శక్తిమాన్’ సీరియల్ ప్రసారమైంది. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ నటుడు ముఖేశ్ ఖన్నా నటించారు. ఇక, త్వరలో పట్టాలెక్కనున్న ‘శక్తిమాన్’ ప్రాజెక్ట్‌ను మూడు భాగాల్లో తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Imran Khan: మరో జైలుకు ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశం
-
Amazon: కృత్రిమ మేధ స్టార్టప్‌లో అమెజాన్ రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
-
AIADMK: ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే కటీఫ్.. పార్టీ శ్రేణుల సంబరాలు!
-
ఖాకీ దుస్తుల్లో ఎవరొచ్చినా కరిచేలా శునకాలకు ట్రైనింగ్.. తనిఖీల్లో పోలీసులకు భయానక అనుభవం
-
Harish Shankar: నిజమైన అభిమానులు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటారు: హరీశ్ శంకర్
-
Naveen Chandra: కలర్స్ స్వాతితో పెళ్లి.. చాలామంది అడిగారు: నవీన్ చంద్ర