Mukhachitram: విశ్వక్‌సేన్‌ ‘ముఖచిత్రం’.. ఓటీటీలోకి వచ్చేస్తోంది!

‘ముఖచిత్రం’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. విశ్వక్‌సేన్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండనుందంటే?

Published : 02 Feb 2023 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వక్‌సేన్‌ (Vishwak Sen) కీలక పాత్రలో నటించిన కోర్టురూమ్‌ డ్రామా సినిమా ‘ముఖచిత్రం’ (Mukhachitram). వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రధారులు. దర్శకుడు గంగాధర్‌ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ బుధవారం ఖరారైంది. ‘ఆహా’లో ఫిబ్రవరి 3 నుంచి అందుబాటులో ఉండనుంది.

క‌థేంటంటే: మ‌హ‌తిని (ప్రియ వ‌డ్ల‌మాని)ని ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకుంటాడు రాజ్ కుమార్ (వికాస్ వశిష్ట). అత‌డు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్. ఆయన్ను మాయా ఫెర్నాండెజ్ (అయేషా ఖాన్) అనే యువ‌తి చిన్న‌ప్ప‌ట్నుంచీ ప్రేమిస్తుంటుంది. త‌న ప్రియుడికి పెళ్లి కావ‌డంతో నిరాశ చెందుతుంది. అంతా సవ్యంగా సాగుతున్న ద‌శ‌లో రాజ్ జీవితంలో కొన్ని అనూహ్య‌మైన సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి. అవి రాజ్ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? అత‌ని జీవితంలో డాక్టర్ సత్య (చైతన్య రావు) ఎలా భాగమయ్యాడు? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని