ఆలియా, సంజయ్‌లకు కోర్టు సమన్లు

‘గంగూబాయ్ కతియావాడి’ విషయమై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, నటి ఆలియాభట్‌కు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మే 21న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది....

Published : 25 Mar 2021 13:11 IST

ముంబయి: ‘గంగూబాయ్ కతియావాడి’ విషయమై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, నటి ఆలియాభట్‌కు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మే 21న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ‘గంగూబాయ్‌ కతియావాడి’లో గంగూబాయ్‌ని కించపరిచేలా సన్నివేశాలున్నాయని పేర్కొంటూ ఆమె దత్త పుత్రుడు రాజీవ్‌ షా కోర్టులో దర్శకుడు, నటిపై పరువు నష్టం దావా వేశారు. గురువారం విచారణ అనంతరం వాళ్లిద్దరూ వచ్చే నెలలో తమ ఎదుట హాజరు కావాలని కోర్టు తెలిపింది.

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సంజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’. ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ప్రముఖ రచయిత హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్‌ ముంబయి’ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకొంది. అయితే, ఈ సినిమాలో గంగూబాయ్‌ని కించపరిచేలా చూపించారని పేర్కొంటూ ఇటీవల ఆమె దత్త పుత్రుడు రాజీవ్‌ షా కోర్టును ఆశ్రయించాడు.. ఈ సినిమాలోని సన్నివేశాలు తన తల్లిని నెగటివ్‌గా చూపించేలా ఉన్నాయని.. సమాజంలో ఆమె గౌరవానికి భంగం వాటిల్లే అవకాశముందని రాజీవ్‌ షా కోర్టుకు తెలియజేశాడు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని