30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు 

టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు ముప్ఫయేళ్ల తర్వాత ఒకే చోట కలిశారు. ఆ అరుదైన ఘటనకు రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికైంది. ఇంతకీ ఎవరా ముగ్గురు సోదరులు అనేగా మీ అనుమానం. 90ల్లో క్రితం వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా గుర్తుందిగా. ఆ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి, మురళీ మోహన్‌, శరత్‌కుమార్‌ అన్నదమ్ములుగా

Published : 25 Jan 2021 01:19 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు 30ఏళ్ల తర్వాత ఒకే చోట కలిశారు. ఆ అరుదైన ఘటనకు రామోజీ ఫిల్మ్‌ సిటీ వేదికైంది. ఇంతకీ ఎవరా ముగ్గురు సోదరులు అనేగా మీ అనుమానం. 90ల్లో వచ్చిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమా గుర్తుందిగా. ఆ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి, మురళీ మోహన్‌, శరత్‌కుమార్‌ అన్నదమ్ములుగా నటించారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు దాదాపు 30ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు.

ప్రస్తుతం ఈ ముగ్గురూ రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే తమతమ సినిమా చిత్రీకరణల్లో బిజీగా ఉన్నారు. మెగాస్టార్‌ ‘ఆచార్య’ చిత్రీకరణలో ఉండగా.. మరళీ మోహన్‌, శరత్‌కుమార్‌ వేర్వేరు సినిమాలు చేస్తున్నారు. ఇలా అనుకోకుండా.. ఈ ముగ్గురు ఒకేచోట కలవడంతో ‘గ్యాంగ్‌లీడర్‌’ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ముగ్గురూ కలిసి ఫొటో తీసుకుని అభిమానులతో పంచుకున్నారు. ముగ్గురం కలుసుకోగానే 1991లో ‘గ్యాంగ్‌లీడర్‌’లో అన్నదమ్ములుగా నటించిన విషయం గుర్తొచ్చిందని మురళీమోహన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కోసారి అనుకోకుండా జరిగే ఇలాంటి సంఘటనలు మంచి అనుభూతిని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోను చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. సినిమాలోని చిత్రాన్ని, ప్రస్తుత చిత్రాన్ని ఒక్కచోట చేర్చి సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు.

విజయబాపినీడు దర్శకత్వంలో వచ్చిన సినిమా తెలుగు చిత్రసీమలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. చిరంజీవి సరసన కథానాయికగా విజయశాంతి ఆడిపాడింది. రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య కీలక పాత్రల్లో నటించారు. మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి నిర్మాత. 1991 మే 9న విడుదలైన ఈ చిత్రం ఎన్నో రికార్డులు తిరగరాసింది.

ఇదీ చదవండి..

అరవింద్ ‌స్వామి సైకిల్‌ దొంగ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు