Thangalaan: ‘తంగలాన్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌..

విక్రమ్‌ నటిస్తోన్న ‘తంగలాన్‌’ (Thangalaan) అప్‌డేట్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాశ్‌ షేర్‌ చేశారు. త్వరలోనే ట్రైలర్‌ రానున్నట్లు తెలిపారు.

Published : 01 Jul 2024 14:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వైవిధ్యమైన కథలను ఎంచుకునే హీరోల్లో విక్రమ్‌ ముందుంటారు. ఆయన (Vikram) నటిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనిపై సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సినిమా మ్యూజిక్‌ పనులు పూర్తయ్యాయి. నాకు సాధ్యమైనంతవరకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాను. సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే మైండ్‌ బ్లోయింగ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. మరో ఇండియన్‌ మూవీ చరిత్ర సృష్టించనుంది’ అని పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

‘తంగలాన్‌’ విషయానికొస్తే.. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా.రంజిత్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే దీని టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. ఓ సందర్భంలో విక్రమ్‌ దీని గురించి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ సినిమా కోసం ఇంత కష్టపడలేదన్నారు. విభిన్నకథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గ్లామర్‌కు చోటులేదన్నారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు మరో ప్రపంచంలోకి వెళ్తారని హామీ ఇచ్చారు. 

రివ్యూ: ‘గురువాయూర్‌ అంబలనాదయిల్‌’.. మలయాళ బ్లాక్‌ బస్టర్‌ ఎలా ఉంది?

ఆగస్టు 15కు వరుస కడుతోన్న సినిమాలు..

సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా రూపొందుతున్న ‘పుష్ప2’ను మొదట ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్‌ పూర్తికాకపోవడంతో ఆ చిత్రాన్ని డిసెంబర్‌కు వాయిదా వేశారు. దీంతో ఈ తేదీకి సినిమాలు పోటీపడుతున్నాయి. పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రామ్‌ పోతినేని (Ram pothineni) హీరోగా తెరకెక్కుతోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double iSmart) ఆగస్టు 15న రావడం ఖాయమైంది. అలాగే నివేదా థామస్‌ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న ‘35 - ఇది చిన్న కథ కాదు’ (35Movie) కూడా ఇదే తేదీన సందడి చేయనుంది. నార్నే నితిన్‌ హీరోగా నటిస్తోన్న ‘ఆయ్‌’ ఈ తేదీనే ఫిక్స్‌ చేసుకుంది. ఇప్పుడు ‘తంగలాన్‌’ (Thangalaan) కూడా అదే తేదీకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆగస్టు 15 ఇప్పుడు టాక్ ఆఫ్‌ ఇండస్ట్రీగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని