కీరవాణి జీవితంలో ‘R’ అనుబంధం ప్రత్యేకం

ఎమ్‌. ఎమ్‌. కీరవాణి జీవితంలో  ‘ఆర్‌’ అనే అక్షరంతో  ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ విశేషమేంటో చూద్దాం. 

Updated : 04 Jul 2021 14:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు ఎమ్‌. ఎమ్‌. కీరవాణి.  ఆయన జీవితంలో  ‘ఆర్‌’ అనే అక్షరంతో  ప్రత్యేక అనుబంధం ఉంది.  ‘మనసు మమత’తో తొలిసారి సంగీత దర్శకుడయ్యారు.  కీరవాణి సంగీతం అందించిన తొలి సినిమాను నిర్మించింది రామోజీరావు. ఆ తర్వాత  ఉషాకిరణ్‌ మూవీస్‌ బ్యానర్‌లో వరుస అవకాశాలు అందుకున్నారు. ‘పీపుల్స్ ఎన్‌కౌంటర్’‌, ‘అశ్విని’, ‘అమ్మ’  ఆఫర్లు అందించి టాలీవుడ్‌లో గట్టి పునాది పడేందుకు తోడ్పడ్డారు. ఆ తర్వాత ‘ఆర్’‌.. రామ్‌గోపాల్‌ వర్మ. ‘శివ’తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టి విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడాయన. అలాంటి సమయంలో తన రెండో చిత్రం ‘క్షణక్షణం’ సినిమాకు కీరవాణిని ఎంచుకోవడంతో ఇండస్ట్రీలో ఆయన పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్‌ అంతా కీరవాణి గురించి మాట్లాడుకున్నారు.  దీంతో పెద్ద సినిమాల ఆఫర్లు వరుస కట్టాయి . ఇక ఇంకో ‘ఆర్‌’  ఆయన సోదరుడు రాజమౌళి. ‘బాహుబలి’ సినిమాతో  కీరవాణి ప్రతిభను, పేరును విశ్వవ్యాప్తం చేశాడాయన. ఈ ముగ్గురే కాదు.. మరో వ్యక్తి కూడా కీరవాణి కెరీర్‌లో కీలకంగా వ్యవహరించారు. ఆయనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. అత్యధికంగా 27 చిత్రాలకు దర్శకేంద్రుడితో పనిచేశారు. వాటిలో ఎక్కువశాతం హిట్లే. వీరందరి పేర్లు ‘ఆర్‌’ తోనే మొదలవడం, ఇప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంగీతమందిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.  అలా కీరవాణికి ‘ఆర్‌’ అక్షరంతో  విడదీయరాని అనుబంధం ఏర్పడింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని