మానవత్వాన్ని చాటుకున్న సంగీత దర్శకుడు పీఆర్‌

తలపై పెరిగే జుట్టు కొద్ది రోజులు మనకు చికాకుగా అనిపించినా ఎదుటి వారికి ఆనందాన్ని ఇస్తుందంటే నమ్ముతారా?

Updated : 24 Jan 2022 09:30 IST

హైదరాబాద్‌: తలపై పెరిగే జుట్టు కొద్ది రోజులు మనకు చికాకుగా అనిపించినా ఎదుటి వారికి ఆనందాన్ని ఇస్తుందంటే నమ్ముతారా? అవును..! మనం ఇష్టంగా బాగా పెంచే జుట్టు మరొకరికి ఆనందాన్ని, అందాన్ని ఇస్తుంది. ఇదే విషయాన్ని రుజువు చేశారు ప్రముఖ యువ సంగీత సంచలనం పీఆర్‌. ‘నల్లమల’ చిత్రంలో ‘ఏమున్నావే పిల్ల’ పాటతో సినీ సంగీత ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలతో బిజీగా ఉన్న పీఆర్‌.. కొన్నాళ్లుగా తన జుట్టును పెంచారు. సినిమా వాళ్లు పనిలోపడి ఇలాగే పెంచుతారని కొందరు, ఇలా ఒత్తుగా, పొడవుగా ఫ్యాషన్‌గా పెంచుకోవడం అలవాటని మరికొందరు అభిప్రాయపడ్డారు.

కానీ, ఆ అభిప్రాయాలను తలకిందులు చేస్తూ ఒక మంచిపని కోసం PR జుట్టు పెంచారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు తమ జుట్టు కోల్పోతారు. వారికి ఆ బాధ తెలియకుండా హైదరాబాద్‌లోని హైదరాబాద్ హెయిర్ డొనేషన్ అనే స్వచ్చంద సంస్థ.. చాలా రోజుల నుంచి జుట్టును సేకరిస్తోంది. అలా సేకరించిన వాటిని విగ్గులుగా తయారుచేసి క్యాన్సర్ బాధితులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే పీఆర్‌ కూడా క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు తన జుట్టును దానం చేశారు. తన వంతు ఈ చిన్న సహాయం చేయడం ఎంతో తృప్తిగా ఉందని పీఆర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని