పూరి కళ్లలో నీళ్లు తిరిగాయి: సంగీత దర్శకుడు సునిల్ కశ్యప్
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది
ఆకాష్ పూరి, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. అనిల్ పాదురి దర్శకుడు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ అందించిన పాటలు యువతను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
ఆ మాటల్లో కసి కనపడింది
ఈ సినిమాలో సరదాగా చేసిన పాటలు చాలా ఉన్నాయి. ‘ఇస్మార్ట్ గ్యాంగ్’ అంతా అలా కూర్చుని సరదాగా చేసిన పాటే ‘పీనే కే బాద్’. దర్శకుడు అనిల్ ప్రత్యేకంగా అలాంటి పాటలే కావాలనేవాడు. సినిమాకు ‘రొమాంటిక్’ అని టైటిల్ పెట్టినప్పటి నుంచి నేనూ రొమాంటిక్‌గా మారిపోయి పాటలను కంపోజ్ చేశాను. హీరోయిన్ కేతిక శర్మ పాడిన ‘నా వల్ల కాదే’ అనే పాట పెద్ద హిట్ అయింది. వాస్కోడిగామ పాటలో ఆకాష్ వాయిస్ అద్బుతంగా ఉంటుంది. పూరి కన్నా ఆకాష్ వాయిస్ బాగా వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆకాష్ మాట తీరు చూశాక ఆయనలో కసి కనబడింది. నాకు తెలిసిన వాళ్లు కూడా ఫోన్ చేసి ‘పీకే కే బాద్’ అని మాట్లాడుతున్నారు. రాత్రి పూట ఆ పాట పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు. నేను తెలియని వాళ్లు కూడా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. నటన పరంగా ఆకాష్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. రీరికార్డింగ్ చేసేటప్పుడే ఆ విషయం స్ఫష్టంగా అర్థమైంది.
పూరి కళ్లలోంచి నీళ్లు
అనిల్ అద్భుతంగా తెరకెక్కించాడు. చాలా ఇష్టపడి ఈ సినిమాను చేశాం. సినిమాలో చాలా ఎమోషనల్ కంటెంట్ ఉంది. ముఖ్యంగా ద్వితీయార్థం భావోద్వేగంగా సాగుతుంది. పూరి మామూలుగా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వరు.. అలాంటిది సినిమా చూశాక ఆయన కళ్లలోంచి నీళ్లు వచ్చాయి. రేపు ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.
అల్బమ్ చూసి ఎంపిక
మేం అంతా ఒక చోట కలిస్తే చాలా సరదాగా ఉంటుంది. పూరి, ఛార్మీ పక్కనే ఉంటే నేను గిటార్ పట్టుకుని వాయిస్తుంటాను. కరోనా దయ వల్ల కావాల్సినంత టైం కూడా దొరికింది. అందుకే కష్టం కన్నా ఇష్టం ఎక్కువగా పెరిగింది. పూరితో ఉంటే సెన్సాఫ్ హ్యూమర్ పెరుగుతుంది. భాస్కరభట్ల పీనే కే బాద్ పాటను అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పదాన్ని రాస్తుంటే మేం అలా ఆశ్చర్యపోయేవాళ్లం. నా వల్ల కాదే అనే పాటను కూడా అద్భుతంగా రాసేశారు. నేను చేసిన ఆల్బమ్‌లో చూసే కేతికను హీరోయిన్గా ఎంచుకున్నారు. పాటలు పాడుతుందని తెలిసే తీసుకున్నాం. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది ముఖ్యం కాదు. హిట్ అయితే అదే పెద్ద సినిమా. పూరి ప్రతీ సినిమాకు నన్ను పిలుస్తారు. అన్ని సినిమాలు నాకు ఇవ్వాలని ఏమీ లేదు. ఇవ్వకపోయినా ఆయనతో ఉండటమే నాకు ఇష్టం.
మరో రెండు ప్రాజెక్టులు
హిందీలోనూ రెండు సినిమాలు చేశాను. సినిమాలే కాకుండా క్లాసికల్ సంగీతం వైపు వెళ్లాలని ఉంది. ఒకప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను.. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాను అనేది చూసుకుంటాను. ఏం జరిగినా మన మంచికే. అలానే ముందుకు వెళ్లాలని అనుకుంటాను. ప్రస్తుతం సత్యదేవ్ హీరోగా నటిస్తోన్న ‘గాడ్సే’ సినిమా చేస్తున్నాను. మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే? -
Fahadh Faasil: రాజమౌళి సమర్పణ.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫహద్ ఫాజిల్ మూవీస్
Fahadh Faasil: విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. -
upcoming movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓటీటీలో థ్రిల్లింగ్ కంటెంట్
గత వారం బాక్సాఫీస్ వద్ద పదికి పైగా చిన్న చిత్రాలు సందడి చేయగా, ఈ వారం కూడా అదే పంథా కొనసాగనుంది. థియేటర్లో మరికొన్ని చిన్న సినిమాలు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. -
Priyadarshi: ఆ చిత్రానికి, ‘ఓం భీమ్ బుష్’కి పోలిక ఉండదు: ప్రియదర్శి
తన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు ప్రియదర్శి. -
Suriya 43: సూర్య 43వ చిత్రంపై అప్డేట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్
తమిళ హీరో సూర్య కొత్త సినిమా ‘సూర్య43’గురించి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కొత్త అప్డేట్ ఇచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత