Varisu: విజయ్‌ అన్నా.. నేను ఏడ్చేశా: తమన్‌ ట్వీట్‌

విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారిసు’. ఈ సినిమాకు పనిచేసిన సంగీత దర్శకుడు తమన్‌ తాజాగా ట్వీట్‌ పెట్టారు.

Published : 11 Jan 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ నటుడు విజయ్‌ (Vijay)పై ఉన్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు సంగీత దర్శకుడు తమన్‌ (S Thaman). ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘వారిసు’ (Varisu). సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కాబోతోంది. తాజాగా చిత్రాన్ని చూసిన తమన్‌ భావోద్వేగానికి గురై ట్వీట్‌ చేశారు. ‘‘విజయ్‌ అన్నా.. సినిమాలోని ఎమోషనల్‌ సీన్స్‌ చూసి ఏడ్చేశా. కన్నీరు విలువైంది. వారిసు సినిమా నా హృదయాన్ని హత్తుకుంది. ఇంతటి పెద్ద అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్‌. లవ్‌ యూ అన్నా’’ అని తమన్‌ పేర్కొన్నారు. విజయ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశారు.

యాక్షన్‌కంటే ఎక్కువగా ఈ సినిమాలో ఎమోషనే ఉంటుందని చిత్ర బృందం ప్రచారంలో భాగంగా తెలియజేసింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాని తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో హీరో సోదరులుగా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, ‘కిక్‌’ శ్యామ్‌ నటించారు. శరత్‌కుమార్‌, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ‘వారసుడు’ పేరుతో జనవరి 14 నుంచి ఈ సినిమా సందడి చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు