Taman: ఆంధ్రప్రదేశ్‌లో స్టూడియో పెట్టాలనుకుంటున్నా: సంగీత దర్శకుడు తమన్‌

విశాఖలోని భీమిలిలో తాను మ్యూజిక్‌ రికార్డింగ్‌ స్టూడియే ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సంగీతదర్శకుడు తమన్‌ తెలిపారు. ఏయూలో ఏర్పాటు చేసిన ఆడియో ఇంజినీరింగ్‌, మ్యూజిక్‌ ప్రొడక్షన్‌ స్టూడియోను  వీసీ ప్రసాదరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

Updated : 26 Mar 2023 17:28 IST

ఏయూ ప్రాంగణం: తెలుగు నేల కలలకు పుట్టినిల్లని సినీసంగీత దర్శకుడు తమన్ (Taman) అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University), సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియోని ఏయూ వీసీ ప్రసాదరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తమన్‌ మాట్లాడుతూ.. విశాఖ కేంద్రంగా ఇంతటి భారీ స్టూడియో నిర్మాణం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎందరో ప్రఖ్యాత కవులు, నటులు, సంగీతకారులు జన్మించారన్నారు. ఇక్కడి భాష, యాస తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెప్పారు. తన విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో గడపడానికి ఇష్టపడతానని తెలిపారు. భీమిలిలో తాను మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తన తల్లిదండ్రుల నుంచి సంగీతం వారసత్వంగా వచ్చిందన్న ఆయన.. సంగీతం ఉన్నచోట ప్రశాంతత చేకూరుతుందన్నారు.

ఏయూ వీసీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. తొలి దశలో రూ.3.5 కోట్లు వెచ్చించి రికార్డింగ్ స్టూడియో, ప్రాక్టికల్ ట్రైనింగ్ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి సంగీత రంగంలో రాణించడానికి అవసరమైన కోర్సులను అందిస్తామన్నారు. తాజాగా సౌండ్‌ అండ్‌ రికార్డింగ్‌ ప్రి ప్రొడక్షన్‌ సర్టిఫికెట్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఏయూలో పీజీతోపాటు కళలకు సంబంధించిన కోర్సు చేసే అవకాశం కల్పిస్తున్నామన్నారు. త్వరలోనే ఏయూ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు