Chiru153: చిరు మూవీకి తమన్‌ సంగీతం

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్‌ రాజా ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’ రీమేక్‌గా ‘చిరు 153’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది.

Updated : 28 Jun 2021 19:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు మోహన్‌ రాజా ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళీ చిత్రం ‘లూసీఫర్‌’ రీమేక్‌గా ‘చిరు 153’ వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్‌ ఎంపికయ్యారు. తాజాగా మోహన్‌ రాజా, తమన్‌ మధ్య సంగీత చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తమన్. ‘చిరు 153ని మేం ప్రారంభించాం. మెగాస్టార్‌ చిరంజీవి గారిపై ప్రేమని చూపించే సమయం ఆసన్నమైంది. కచ్చితంగా మీ అందరినీ మెప్పించేలా ఈ సినిమా సంగీతం ఉంటుంది’ అని తెలిపారు. టాలీవుడ్‌ అగ్ర హీరోలందరికీ సంగీతం అందించిన తమన్‌ తొలిసారి చిరంజీవి సినిమాకి పనిచేస్తున్నారు. రామ్‌ చరణ్‌ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్‌లీ’ చిత్రంతో చిరంజీవి ఎంట్రీకి తమన్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ‘చిరు 153’పై అంచనాలు భారీగా నమోదవనున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని