Music School: మ్యూజిక్‌ స్కూల్‌లో...

శర్మాన్‌జోషి, శ్రియా శరణ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Updated : 26 Jan 2022 07:08 IST

ర్మాన్‌జోషి, శ్రియా శరణ్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇళయరాజా సంగీత సారథ్యం వహిస్తున్నారు. హైదరాబాద్‌లో మూడో షెడ్యూల్‌ చిత్రీకరణని పూర్తి చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘మెరీ డిక్రూజ్‌గా శ్రియ, మనోజ్‌గా శర్మాన్‌ జోషి నటిస్తున్నారు. వాళ్ల పాత్రలు కళలు, సంగీతం, సంస్కృతి, విద్యపై ప్రభావం చూపించేలా ఉంటాయి. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంగా ప్రారంభమైన మూడో షెడ్యూల్‌ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. పలు జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరణ చేశాం’’ అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, హిందీలోనూ తెరకెక్కిస్తున్నారు. షాన్‌, సుహాసిని ములై, ప్రకాష్‌రాజ్‌, బెంజమిన్‌ గిలాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినయ్‌ వర్మ తదితరులు నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని