Anchor Pradeep: తండ్రిని తలచుకొని భావోద్వేగం
తండ్రే తన సూపర్ హీరో అంటూ యాంకర్ ప్రదీప్ మాచిరాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా కారణంగా తన తండ్రి పాండురంగ(65) మూడు వారాల కిందట తుదిశ్వాస విడిచారు. కాగా.. తన తండ్రిని జ్ఞాపకాల్లో నుంచి ప్రదీప్ బయటకు రాలేకపోతున్నారు. తండ్రితో తన ప్రయాణాన్ని గుర్తు నెమరు వేసుకుంటూ ప్రదీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు. తన తండ్రి గొప్పతనాన్ని, వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తండ్రే తన సూపర్ హీరో అంటూ యాంకర్ ప్రదీప్ మాచిరాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా కారణంగా తన తండ్రి పాండురంగ(65) మూడు వారాల కిందట తుదిశ్వాస విడిచారు. కాగా.. తన తండ్రిని జ్ఞాపకాల్లో నుంచి ప్రదీప్ బయటకు రాలేకపోతున్నారు. తండ్రితో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ప్రదీప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టు చేశారు. తన తండ్రి గొప్పతనాన్ని, వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
‘‘ఐ లవ్ యూ నాన్న.. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణమైన నీకు థాంక్యూ. నాకు గౌరవ మర్యాదలతో బతకడం నేర్పినందుకు థాంక్యూ నాన్న.. నేను ఇప్పుడు చేసేదంతా మీ గొప్పతనమే.. ఇదంతా మీకే అంకితం. నా కోసం మీరు అనుక్షణం నిలబడ్డారు. నేను చెడ్డ దారి ఎంచుకుంటే మీరు నన్ను సరిదిద్దారు. నాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. మీ ప్రేమకంటే గొప్పది మరొకటి లేదు. మీరు నాకెప్పుడూ ప్రత్యేకమే. నా జీవితంలో నేను ఎక్కడికి వెళ్లినా.. ఎంత ఎదిగినా.. మిమ్మల్ని ప్రేమతో గుర్తుంచుకుంటా. మీరు ఎప్పుడూ కోరుకున్నట్లే.. నేను ఇకమీదట కూడా ప్రజలకు వినోదం పంచుతూ ఉంటా(మళ్లీ మనం కలిసే వరకూ). మిస్ యూ నాన్న’ అని ప్రదీప్ పోస్టు చేశారు. ఆ పోస్టుపై యాంకర్ అనసూయతో పాటు పలువురు సెలెబ్రిటీలు యాంకర్ ప్రదీప్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Cricket: నాన్‌స్ట్రైకర్ రనౌట్.. బ్యాట్ విసిరి కొట్టిన బ్యాటర్
-
General News
Amaravati: రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandra Babu: పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో రూపొందించాలి: చంద్రబాబు
-
India News
Supreme Court: ఇందులో హక్కుల ఉల్లంఘనేముంది?: ఫైజల్ ‘అనర్హత’ పిటిషన్‌పై సుప్రీం
-
Movies News
Samantha: దాని కోసం యాచించాల్సిన అవసరం నాకు లేదు..: సమంత