Salman Khan: నాకు పెళ్లి వయసు దాటిపోయింది: సల్మాన్‌ఖాన్‌

పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan). తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందన్నారు.

Published : 27 May 2023 14:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెళ్లి గురించి స్పందించారు. తనకు పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందన్నారు.

ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డులు (ఐఫా) - 2023కు సంబంధించి మీడియా సమావేశం గురువారం దుబాయ్‌లో జరిగింది. బీటౌన్‌ నుంచి సల్మాన్‌ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నోరా ఫతేహి, విక్కీ కౌశల్‌ తదితరులు మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఓ మహిళా అభిమాని సల్మాన్‌కు ప్రపోజ్‌ చేసింది. ‘‘సల్మాన్‌ మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మీతో చెప్పడం కోసం హాలీవుడ్‌ నుంచి ఇక్కడికి వచ్చాను’’ అంటూ ఆమె తన ఇష్టాన్ని తెలపగా.. ‘‘మీరు షారుక్‌ ఖాన్ గురించి మాట్లాడుతున్నారు కదా!’’ అని సల్లూబాయ్‌ జోక్స్‌ వేశారు. అనంతరం ఆమె..‘‘లేదు. నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. దీనిపై స్పందించిన సల్మాన్‌... ‘‘నాకు పెళ్లి వయసు దాటిపోయింది. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది’’ అని సరదాగా బదులిచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక, సల్మాన్‌ఖాన్‌కు గతంలో పలు బ్రేకప్‌ స్టోరీలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన ప్రేమ కథల గురించి మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో సరైన వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటాను. నిజం చెప్పాలంటే, నా మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరూ మంచివారే. వాళ్ల వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. తప్పంతా నాతోనే. సంతోషంగా చూసుకోలేననే భయం వల్లే వాళ్లు నన్ను వదిలివెళ్లిపోయి ఉండొచ్చు. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. నా ప్రేమకథలన్నీ నాతోపాటే సమాధి అవుతాయి’’ అని తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని