Vanitha: విడాకులు తీసుకున్నానని దూరం పెట్టేశారు
అలనాటి సినీ తారలు మంజులా, విజయ్‌కుమార్ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘దేవి’తో తెలుగువారికి చేరువైన నటి వనిత. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు....
శ్రీదేవి, ప్రీత కూడా పట్టించుకోలేదు
చెన్నై: అలనాటి సినీ తారలు మంజులా, విజయ్‌కుమార్ దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ‘దేవి’తో తెలుగువారికి చేరువైన నటి వనిత. వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో నటిగా పలు సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వైవాహిక జీవితంలో చవిచూసిన ఎన్నో చేదు నిజాలను బయటపెట్టారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తనకు ఏవిధమైన సపోర్ట్ అందించలేదని చెప్పారు. తన చెల్లెళ్లు ప్రీత, శ్రీదేవి జీవితాలు ఇప్పుడు సంతోషంగా ఉన్నాయంటే అందుకు తాను ఓ కారణమని.. కాకపోతే ఇప్పుడు వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదని చెప్పి వనిత భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వైవాహిక జీవితం విఫలమవడానికి నా తల్లిదండ్రులు కూడా ఓ కారణమనే చెప్పాలి. 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నాకు వివాహం చేసేశారు. అప్పట్లో అసలు జీవితమంటే ఏమిటో కూడా నాకు తెలీదు. దాంతో నా భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. మానసిక కుంగిపోయాను. ఆ బాధను తట్టుకోలేక చాలాసార్లు పుట్టింటికి వచ్చేశాను. చివరికి చేసేది లేక విడాకులు తీసుకున్నాను. నా తల్లిదండ్రులకు అది నచ్చలేదు. నా వల్ల వాళ్ల పరువు పోతుందని భావించి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వాళ్ల నుంచి నాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. నా ముగ్గురు పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేశాను. అదే సమయంలో నాకు కూడా ఓ సపోర్ట్ ఉంటే బాగుంటుందని భావించి ప్రేమించిన వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నాను. తను నన్ను బాగా చూసుకున్నాడు. చిన్న చిన్న గొడవలైనప్పటికీ మా జీవితం ఎంతో ఆనందంగా సాగింది. అదే సమయంలో మా నాన్న పిల్లల పెంపకం గురించి కేసు పెట్టడం వల్ల నా భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక మూడో వివాహం గురించి చెప్పడానికి ఏమీ లేదు’’
‘‘నిజం చెప్పాలంటే నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు. ఒకవేళ వాళ్లే కనుక నాకు మద్దతుగా ఉంటే నా జీవితం మరోలా ఉండేది. నా సోదరుడు అరుణ్ విజయ్ వివాహానికి కూడా నన్ను ఆహ్వానించలేదు. అంతేకాకుండా నా సోదరి ప్రీత వివాహం జరిగేలా చేసింది నేనే. దర్శకుడు హరితో తన పెళ్లికి ఎవరూ అంగీకారం తెలపలేదు. కానీ, ఇంట్లో వాళ్లందరితో గొడవపడి మరి తన వివాహం చేశా. నా మొదటి భర్త స్నేహితుడి సోదరుడు రాహుల్‌తో మరో సోదరి శ్రీదేవి పెళ్లి అయ్యేలా చేసింది నేనే. వివాహ బంధంలో వాళ్లు సంతోషంగా ఉన్నారంటే నేను కూడా ఓ కారణం. ఇప్పుడు వాళ్లు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. సోషల్‌మీడియాల్లో నన్ను బ్లాక్ చేశారు. ఏది ఏమైనా దేవుడి దయ వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బల వల్లే ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను’ అని వనితా విజయ్‌కుమార్ తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Espionage: రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు.. ప్రచ్ఛన్న యుద్ధానంతరం మొదటిసారి!
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
Sports News
IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
-
Movies News
Rana Naidu: ‘రానా నాయుడు’.. తెలుగు ఆడియో డిలీట్.. కారణమదేనా?
-
Politics News
Congress: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్లకు తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!