Hansika: మనిషి చర్మంతో వ్యాపారం.. ఉత్కంఠగా హన్సిక ‘..శ్రుతి’ టీజర్‌

హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ఈ నాయికా  ప్రాధాన్య చిత్రానికి శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 13 Jan 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శ్రుతి’. ఈ నాయికా ప్రాధాన్య చిత్రానికి శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. హన్సిక తన గురించి తాను పరిచయం చేసుకునే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. సంభాషణలు బట్టి చూస్తుంటే మనిషి చర్మంతో చేసే వ్యాపారం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ‘చర్మం వలిచి బిజినెస్‌ చేస్తామంటున్నారు. ఏం చేయాలి వాళ్లను’ అనే ప్రశ్నతో టీజర్‌ ముగిసింది. 

ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. మురళిశర్మ, పూజా రామచంద్రన్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై బూరుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: మార్క్‌ రాబిన్‌, ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని