నా కోసం అమ్మవాళ్లు బెంగ పెట్టుకున్నారు: జాక్వెలిన్‌ 

‘ప్రస్తుతం దేశమంతా కరోనా రెండోదశతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందయితే చాలా భయపడుతున్నారు. ఇండియాలో ఉన్న పరిస్థితులపై తన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు బహ్రెయిన్‌లో నివసించే అమ్మనాన్న మా దగ్గరకు వచ్చేయమంటున్నారు’ అని చెబుతోంది బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్‌.

Published : 02 Jun 2021 01:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ప్రస్తుతం దేశమంతా కరోనా రెండోదశతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందయితే చాలా భయపడుతున్నారు. ఇండియాలో ఉన్న పరిస్థితులపై తన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు బహ్రెయిన్‌లో నివసించే అమ్మనాన్న మా దగ్గరకు వచ్చేయమంటున్నారు’ అని చెబుతోంది బాలీవుడ్‌ నటి జాక్వెలిన్ ఫెర్నాండజ్‌. ‘‘శ్రీలంకలోని స్నేహితులు బహ్రెయిన్‌లో నివసించే నా తల్లిదండ్రులు భారత్‌లో కరోనా రెండోదశ గురించి చాలా భయపడుతున్నారు. ఇక్కడి వార్తలు చూసిన మావాళ్లు చాలా ఆందోళనకు గురవుతున్నారు. బహ్రెయిన్‌లోనే నేను వారితో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇక లంకలోని నా దగ్గరి బంధువులు, మేనమామలు కూడా అదే కోరుకుంటున్నారు. అయితే నేను మాత్రం ప్రస్తుతం ఇక్కడే ఉండి నా పని కొనసాగించాలని ఉందంటోంది ముద్దుగుమ్మ. ఇంకా దేశంలోని కొవిడ్‌ రెండో దశ గురించి మాట్లాడుతూ..‘‘గత ఏడాదిలో కరోనా వైరస్ అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలా ఉండగానే కొవిడ్‌ రెండో దశ వచ్చేసింది. చాలామంది ప్రజలు బయటకు వచ్చి కొవిడ్‌ బాధితులకు సహాయ సహకారాలు అందించారని తెలిపింది. ప్రస్తుతం జాక్వెలిన్‌ తన ‘యేలో’ (యు ఓన్లీ లివ్‌ వన్స్) ఫౌండేషన్‌ ద్వారా కొవిడ్‌ బాధితుల కోసం ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘‘ప్రజల కోసం నేను చేయగలిగినంత వరకు చేస్తాను. నా గురించి ఆలోచించను. ఎందుకంటే  నాకు ప్రస్తుతం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి.. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ కొవిడ్‌ మహమ్మారి సమయంలో కనీస అవసరాలు తీర్చుకోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికోసం నా శక్తిమేర పనిచేస్తాను’’ అని తెలిపింది. ప్రస్తుతం జాక్వెలిన్‌ హిందీలో ‘భూత్‌ పోలీస్‌’, ‘సర్కస్‌’, అక్షయ్‌ కుమార్‌తో కలిసి  ‘బచ్చన్‌ పాండే’, ‘రామ్‌సేతు’ సినిమాల్లో నటిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని