గర్భవతి అనుష్క శీర్షాసనం.. కోహ్లీ సాయం
బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కుదుర్చుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెటర్నటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇటువంటి సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి కసరత్తులు చేస్తున్నారు. ప్రియమైన భర్త విరాట్ కోహ్లీ ఆమెకు అండగా ఉండి...
ముంబయి: బాలీవుడ్ కథానాయిక అనుష్క శర్మ గర్భవతిగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా కుదుర్చుకున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మెటర్నటీ బ్రేక్‌కు ముందే వీలైనంత వరకు షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇటువంటి సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి కసరత్తులు చేస్తున్నారు. ప్రియమైన భర్త విరాట్ కోహ్లీ ఆమెకు అండగా ఉండి, ముందుకు నడిపిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పటికి శీర్షాసనం వేసిన ఫొటోను అనుష్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గోడ ఆధారంగా ఆమె తలకిందులుగా నిల్చోగా.. కోహ్లీ ముందు జాగ్రత్తగా కాళ్లు పట్టుకుని, బ్యాలెన్స్ చేశారు.
‘చేతులు కిందికి పెట్టి.. కాళ్లు పైకి ఎత్తే అతి కష్టమైన వ్యాయామం. ఇది పాత ఫొటో. యోగా నా జీవనశైలిలో ఓ భాగమైపోయింది. గర్భవతిగా ఓ స్థాయి వరకు.. గతంలో రోజూ వేసే ఆసనాలు చేయొచ్చని వైద్యులు సూచించారు. సపోర్ట్ తీసుకుని ఇలాంటి ఆసనాలు వేయమని సలహా ఇచ్చారు. శీర్షాసనాన్ని ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్నా.. గర్భవతిగా వ్యాయామం చేస్తున్నా కాబట్టి గోడను ఆధారంగా తీసుకున్నా. బ్యాలెన్స్ చేయడానికి, మరింత జాగ్రత్త కోసం సమర్థుడైన నా భర్త సాయం చేశాడు (లవ్ సింబల్). నా యోగా శిక్షకురాలి పర్యవేక్షణలో ఇదంతా జరిగింది. గర్భవతిగా ఉన్నప్పుడు కూడా వ్యాయామాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉంది’ అని అనుష్క పోస్ట్ చేశారు. శిశువుకు జన్మనిచ్చిన తర్వాత చిత్రీకరణలో పాల్గొంటానని, నటనలోనే తనకు ఆనందం దొరుకుతుందని ఆమె ఇటీవల మీడియాతో అన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్