Published : 28 May 2022 15:21 IST

Ante Sundharaniki: ‘అంటే సుందరానికీ!’ ట్రైలర్‌ ఎప్పుడంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ!’. ఈ చిత్రం జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని సరసన నజ్రియా నటిస్తున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. నాని అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ట్రైలర్‌ పై చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. మే30వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మైత్రి మూవీస్‌ మేకర్స్‌ పై వస్తున్న ఈ సినిమాకు వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన ‘చక్కిలిగింతల’ ప్రత్యేక వీడియో అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని