Sarkaruvaari Paata: ‘పెన్నీ’ సాంగ్‌ లీక్‌.. మైత్రిమూవీ మేకర్స్‌ ట్వీట్‌

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. బ్యాంక్‌ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా....

Updated : 07 Dec 2022 14:47 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు, కీర్తిసురేశ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్‌ దర్శకుడు. బ్యాంక్‌ కుంభకోణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 12న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో భాగంగా ‘సర్కారు వారి పాట’ ఆల్బమ్‌ని ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘కళావతి’ పాట విశేష ప్రేక్షకాదరణ పొందగా.. తాజాగా ‘పెన్నీ’ సాంగ్‌ విడుదల ప్రకటించింది. ఆదివారం(నేడు) పూర్తి పాటను విడుదల చేస్తామని శనివారం ఉదయం తెలియజేసింది. అభిమానులందరూ ఈ పాట కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోన్న తరుణంలో చిత్రబృందానికి చిన్న షాక్‌ ఎదురైంది. ఓ ప్రముఖ మ్యూజిక్‌ యాప్‌లో ఆదివారం ఉదయమే ‘పెన్నీ’ పూర్తి పాట అందుబాటులోకి వచ్చింది. అది గమనించిన అభిమానులు, టీమ్‌ సభ్యులు చిత్ర నిర్మాణ సంస్థకు సమాచారం అందించారు. చిత్రబృందం ఆ యాప్‌ వారితో మాట్లాడి.. సాంగ్‌ను తొలగించేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై తాజాగా మైత్రి మూవీ మేకర్స్‌ ట్వీట్‌ చేసింది.

‘‘చిత్రబృందం అధికారికంగా పాటల్ని విడుదల చేయడానికంటే ముందు ఆ ఆడియో ట్రాక్‌ని పలు ఆడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌ పంపించి విడుదల సమయాన్ని చెప్పి.. అదే సమయానికి తమ యాప్స్‌లో పాటను అందుబాటులో ఉంచమని చెప్పడం సాధారణంగా జరుగుతుంది. కానీ, ఓ యాప్‌లో మేము అనుకున్న సమయం కంటే ముందే పెన్నీ సాంగ్‌ విడుదలైంది. ఆ సంస్థతో మాట్లాడి ఆ పాటను తొలగించేలా చేశాం. సాయంత్రం 4.05 గంటలకు పూర్తి పాట అందుబాటులోకి రానుంది’’ అని టీమ్‌ ప్రకటించింది. మరోవైపు ‘కళావతి’ పాట సైతం అధికారికంగా విడుదల చేయడానికంటే ముందే ఆన్‌లైన్‌లో లీక్‌ కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు