Ramarao On Duty: ‘నా పేరు సీసా..’ ట్రెండింగ్‌లో శ్రేయా ఘోషల్ పాడిన ఐటమ్ సాంగ్
హైదరాబాద్: ‘నా పేరు సీసా.. నా పేరు సీసా.. ఒకరికి నే తేనే సీసా.. ఒకరి నే కల్లు సీసా’ అంటూ తనదైన వాయిస్‌తో పాట పాడి అదరగొట్టారు శ్రేయా ఘోషల్. రవితేజ(Raviteja) కథానాయకుడిగా శరత్ మండవ తెరకెక్కించిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty). దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik), రజిషా విజయన్ కథానాయికలు. శనివారం ఈ చిత్రంలోని ఐటమ్ సాంగ్ ‘నా పేరు సీసా’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. శ్యామ్ సీఎస్ స్వరాలు సమకూర్చగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఇక ఈ ఐటమ్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, అన్వేషి జైన్ స్టెప్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఇందులో రవితేజ శక్తిమంతమైన ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hair Fall: మీ జుట్టు రాలిపోతుందా..! ఎందుకో తెలుసా..?
-
Sports News
INDw vs AUSw : కామన్వెల్త్ ఫైనల్.. ఆసీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు
-
Politics News
Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
-
Movies News
Nithiin: అభిమానుల కోసం మరో 20 ఏళ్లైనా కష్టపడతా: నితిన్
-
World News
Indain Navy: భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. వెనక్కి తరిమిన కోస్ట్‌గార్డ్ ‘డోర్నియర్’
-
Crime News
Crime News: మిర్యాలగూడలో కారు బీభత్సం.. పలు వాహనాలు ధ్వంసం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Pooja Hegde: ‘సీతారామం’ హిట్.. ‘పాపం పూజా’ అంటోన్న నెటిజన్లు
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- నిమిషాల్లో వెండి శుభ్రం!
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?