రాజగోపాల్‌ ఎవరో నాకు తెలీదు: నరేశ్‌‌

‘అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు ఇప్పుడే మొదలైంది’ అని అంటున్నారు నటుడు అల్లరి నరేష్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా...

Published : 06 Feb 2021 10:47 IST

జీవితం ఇప్పుడే మొదలైంది అంటోన్న నటుడు

హైదరాబాద్‌: ‘అందరూ నా జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు ఇప్పుడే మొదలైంది’ అని అంటున్నారు నటుడు అల్లరి నరేశ్‌‌. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నాంది’. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మహేశ్‌బాబు సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. క్రైమ్‌, థ్రిల్లింగ్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది.

‘రాజగోపాల్‌ గారిని నేను మర్డర్‌ చేయడం ఏమిటి సర్‌. ఇప్పటివరకూ రాజగోపాల్‌ గురించి వినడం తప్పా ఆయన గురించి నాకేం తెలీదు’ అంటూ నరేశ్‌‌ చెప్పే డైలాగులతో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఉద్వేగభరితంగా కొనసాగింది. నరేశ్‌‌ నిజంగానే రాజగోపాల్‌ అనే వ్యక్తిని హత్య చేశారా? లేక చేయని తప్పుకు జైలు శిక్ష అనుభవించాడా? అసలింతకీ ఈ రాజగోపాల్‌ ఎవరు? అతనితో నరేశ్‌‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ప్రియదర్శి, హరీశ్‌‌.. తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 19న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసుప్రసాద్‌

నీ పవర్‌ ఇప్పుడు వాడు: మంచులక్ష్మిTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు