RRR: ‘నాటు నాటు’ ఫీవర్‌.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ‘ఫన్‌’ టాస్టిక్‌ రీమిక్స్‌!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. 2021లో ఈ గీతం విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వందల సంఖ్యలో స్పూఫ్‌లు, రీమిక్స్‌లు దర్శనమిచ్చాయి.

Updated : 09 Jan 2022 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించింది. 2021లో విడుదలై సంచలనంగా మారింది. ఈ పాట విడుదలైన కొన్ని క్షణాల్లోనే నెట్టింట వందల సంఖ్యలో స్పూఫ్‌లు, రీమిక్స్‌లు దర్శనమిచ్చాయి. వేరే చిత్రాల్లోని డ్యాన్స్‌కు ఈ పాటను జతచేసిన వీడియోలు విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఈ పాట క్రేజ్‌ అలానే ఉందని ఇటీవల ఓ నెటిజన్‌ పంచుకున్న వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. వేల సంఖ్యలో లైక్స్‌, వందల సంఖ్యలో రీట్వీట్లు సంపాదించింది. ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలోని సీన్‌ ఇది. ఇందులోని ఇద్దరు నటుల స్టెప్పులకు ‘నాటు నాటు’ పాటను యాడ్‌ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. నవ్వులు పంచుతోంది. ‘సూపర్‌’, ‘పర్‌ఫెక్ట్‌ రీమిక్స్‌’, ‘భలే ఉంది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకుడు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. పీరియాడికల్‌ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలకావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని