
Published : 02 Sep 2021 18:13 IST
Nabha Natesh: నభా నటేశ్ బంపర్ ఆఫర్ కొట్టేసిందా?
ఇంటర్నెట్‌డెస్క్: ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ నభా నటేశ్. ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్‌కు జోడీగా మాస్ డైలాగ్‌లతో అదరగొట్టింది. ఇప్పుడు నితిన్‌కు జోడీగా నటించిన ‘మ్యాస్ట్రో’తో అలరించేందుకు సిద్ధంగా ఉంది. కాగా, నభా తెలుగులో ఓ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు సమాచారం. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశం నభా నటేశ్‌కు దక్కిందని సమాచారం. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదే నిజమైతే నభా కెరీర్‌లో మరో మంచి చిత్రమవుతుంది. మరోవైపు ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఇప్పటికే ప్రకటించారు. హారిక, హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :