అలరిస్తున్న జాన్వీ ‘నాదియాన్‌ పార్‌’

రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాని జియో స్టూడియోస్, మడోక్‌ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. చిత్రం ఈ ఏడాది మార్చి 11న విడుదలై ఆకట్టుకుంది. హారర్‌, కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమాలో జాన్వీ నటన ప్రధాన ఆకర్షణ. 

Published : 02 Jun 2021 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రాజ్‌ కుమార్‌ రావ్‌, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రూహీ’. హార్దిక్‌ మెహతా దర్శకత్వం వహించిన ఈ సినిమాని జియో స్టూడియోస్, మడోక్‌ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. చిత్రం ఈ ఏడాది మార్చి 11న విడుదలై ఆకట్టుకుంది. హారర్‌, కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో జాన్వీ నటన ప్రధాన ఆకర్షణ. తాజాగా ఈ చిత్రంలోని ‘నాదియాన్‌ పార్‌’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌లో వచ్చేసింది. ఈ పాటకి ఐపీ సింగ్‌, జిగర్‌ సారయ్యలు సాహిత్యం అందించగా షమూర్, రష్మీత్ కౌర్, ఐపి సింగ్, సచిన్- జిగర్ ఆలపించారు. ఇందులో వరుణ్‌ శర్మ, మానవ్‌ విజ్‌, సరితా జోషి, సుమిత్‌ గులాటీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దినేష్‌ విజన్‌, మృఘ్‌దీప్‌ సింగ్‌ లంబా నిర్మాతలు. సచిన్‌-జిగర్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని