Nag Ashwin: ‘కల్కి’ రన్‌టైమ్‌పై విమర్శలు.. నాగ్‌ అశ్విన్‌ ఏమన్నారంటే!

‘కల్కి’ రన్‌టైమ్‌పై వచ్చిన విమర్శలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.

Published : 09 Jul 2024 15:51 IST

ఇంటర్నెట్ డెస్క్: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు దీని నిడివి విషయంలో కొందరు విమర్శించారు. తాజాగా వీటిపై నాగ్ అశ్విన్‌ స్పందించారు. తనకు ఎంత టైమ్ ఉన్నా ఎడిట్ చేసేందుకు సరిపోదన్నారు.

‘సినిమా కోసం పడిన కష్టమంతా దాని ఫలితం చూశాక మర్చిపోయాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఆదరణ చూస్తుంటే ఆనందంతో పాటు భావోద్వేగంగాను ఉంది. చిన్నచిన్న ప్రాంతాల్లోనూ మంచి విజయం సాధించింది. ఇలాంటి సినిమాల కోసం నాకు మరో నెల సమయం ఇచ్చినా సరిపోదు. ఇంకాస్త సమయం ఉంటే బాగుండునని భావిస్తాను. కొందరు దీని రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి’.

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. ప్రతి ఫ్రేమ్‌ కళాఖండమే..: మహేశ్‌ బాబు

‘ఇది మొదటి భాగం. ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అంత రన్‌టైమ్ వచ్చింది. కొందరు దీన్ని ‘మహానటి’తో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, కల్కికి చాలా తేడా ఉంది. రెండూ భిన్నమైన కథలు. అది కేవలం ఒక మహిళకు చెందిన కథ, ఆమె పాత్ర మాత్రమే ప్రాధానమైనది. ఇందులో చాలామంది అగ్రతారలు ఉన్నారు. వాళ్ల పాత్రలన్నీ కీలకమైనవే. వాళ్ల పాత్రల చుట్టూ కథ అల్లుకుపోవాలి’ అని చెప్పారు. ‘కల్కి 2898 ఏడీ’ రన్‌టైమ్‌ 3.01 గంటలున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని