Cinema News: ప్రేమసందేశం

రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతిసింగ్‌, శ్రీకృష్ణ, మారుతి సకారం ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘జీ లవ్‌’. శ్రీ  నారాయణ  దర్శకత్వం వహించారు. మహేందర్‌ సింగ్‌, శైలజ తాటిచర్ల, శ్రీనారాయణ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్‌ లోగోని ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇటీవల హైదరాబాద్‌లో  ఆవిష్కరించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందుతున్న

Updated : 13 Aug 2022 07:07 IST

రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతిసింగ్‌, శ్రీకృష్ణ, మారుతి సకారం ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘@ లవ్‌’. శ్రీ  నారాయణ దర్శకత్వం వహించారు. మహేందర్‌ సింగ్‌, శైలజ తాటిచర్ల, శ్రీనారాయణ నిర్మాతలు. ఈ సినిమా టైటిల్‌ లోగోని ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఇటీవల హైదరాబాద్‌లో  ఆవిష్కరించారు. స్వచ్ఛమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకి చేరువ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘అడవి నేపథ్యంలో, వాస్తవానికి దగ్గరగా సాగే చిత్రమిది. ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని  పంచుతుంది. మనసుకు హత్తుకునే భావోద్వేగాలు చిత్రానికి ప్రధానబలం. అంతర్లీనంగా మహిళలకి సంబంధించిన ఓ గొప్ప సందేశం ఉంటుంద’’ని  సినీ వర్గాలు తెలిపాయి. సంగీతం: సన్నీ మాణిక్‌, రామ్‌చరణ్‌, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌,  ఛాయాగ్రహణం: మహేందర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని