Project K: అప్పుడైతే కార్లు అద్దెకు తీసుకున్నాం... ఇప్పుడు అదీ సాధ్యం కాదు: నాగ్‌ అశ్విన్‌

‘ప్రాజెక్ట్‌ కె’పై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం అన్ని కొత్తగా తయారు చేసుకోవాలని ఆయన అన్నారు.

Published : 19 Nov 2022 14:25 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) అనే వర్కింగ్‌ టైటిల్‌ ప్రచారంలో ఉంది. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా గురించి తాజాగా నాగ్‌ అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పటివరకూ మీరు ఇలాంటి చిత్రాన్ని చూసి ఉండరు. విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ‘మహానటి’ సమయంలో ఆ కాలం నాటి కారులను అద్దెకు తీసుకువచ్చి షూట్‌ చేశాం. కానీ, ‘ప్రాజెక్ట్‌ కె’కు అలా కాదు. ఇందులో ఉపయోగించడానికి కావాల్సిన వాహనాలు ఎక్కడా దొరకవు. మేమే తయారు చేసుకోవాలి. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుంది’’ అని తెలిపారు.

పాన్‌ ఇండియా మూవీగా ‘ప్రాజెక్ట్‌ కె’ సిద్ధమవుతోంది. మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో సూపర్‌హీరో మూవీగా ఇది తెరకెక్కుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ దృశ్యరూప చిత్రంగా, అతిపెద్ద యాక్షన్‌ థ్రిల్లర్‌గా ‘ప్రాజెక్ట్ కె’ ను తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు ఉన్నారట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు