Nag Ashwin: ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌: ఫొటో షేర్‌ చేసిన నాగ్‌ అశ్విన్‌

‘ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌..’ అంటూ ‘కల్కి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు.

Published : 10 Jul 2024 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) విడుదలైన రోజు నుంచీ రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. టీమ్‌ అంతా విజయాన్ని ఆస్వాదిస్తోంది. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) సోషల్‌ మీడియా వేదికగా ఆ మూవీ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పోస్ట్‌ చేసిన ఓ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పిక్‌ మరెవరిదో కాదు నటి శోభనది. ‘‘నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ శోభన లుక్‌ టెస్ట్‌కు సంబంధించిన ఫస్ట్‌ పిక్‌ ఇది’’ అంటూ ఆమెపై ఉన్న అభిమానాన్ని మరోసారి వ్యక్తం చేశారు. శోభన (Shobana) కాళ్లకు పట్టీలు అలంకరించిన దృశ్యమది.

శంబాల ప్రజల నాయకురాలు మరియం పాత్రలో శోభన నటించారు. తన అసాధారణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. 18 ఏళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటించిన ఆమె మంచి విజయాన్ని అందుకున్నారు. శోభన నటి మాత్రమే కాదు శాస్త్రీయ నృత్యకారిణి అన్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ పాన్‌ ఇండియా మూవీ రూ.1000 కోట్ల క్లబ్‌లో అతి త్వరలోనే చేరనుంది. జూన్‌ 27న బాక్సాఫీసు ముందుకొచ్చిందీ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని