Kalki: ‘కల్కి’ కథ రాయడానికి 5 ఏళ్లు పట్టింది: నాగ్ అశ్విన్‌

‘కల్కి’ విశేషాలను పంచుకుంటున్నారు నాగ్ అశ్విన్‌. ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’లో తొలి ఎపిసోడ్‌ను విడుదల చేశారు.

Updated : 18 Jun 2024 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కల్కి’ కథ రాయడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు నాగ్ అశ్విన్‌. ఆయన దర్శకత్వంలో ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరకావడంతో చిత్రబృందం ప్రచారం జోరుపెంచింది. ‘వరల్డ్‌ ఆఫ్‌ కల్కి’ పేరుతో కొన్ని విశేషాలను పంచుకునేందుకు సిద్ధమయ్యారు నాగ్‌ అశ్విన్‌ (Nag AshWin). ఇందులో భాగంగా తొలి ఎపిసోడ్‌ను విడుదల చేశారు.

‘భవిష్యత్తులోకి ప్రయాణం’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘కలియుగంలో ఏం జరుగుతుంది. ఏం జరిగే అవకాశం ఉంది.. ఇలాంటి వాటన్నిటికీ ‘కల్కి’ క్లైమాక్స్‌. కేవలం భారతదేశంలోని ప్రేక్షకులేకాదు.. ప్రపంచంలో వారంతా దీనికి కనెక్ట్‌ అవుతారు. నాకు చిన్నప్పటి నుంచి పౌరాణిక చిత్రాలంటే ఆసక్తి ఎక్కువ. ‘పాతాళభైరవి’ నాకు ఇష్టమైన సినిమా. అలాగే ‘భైరవ ద్వీపం’, ‘ఆదిత్య 369’, హాలీవుడ్‌ ‘స్టార్‌ వరల్డ్‌’ ఆకట్టుకున్నాయి. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. కృష్ణవతారంతో అది ముగుస్తుంది. అక్కడి నుంచి కలియుగం ప్రారంభమవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కథగా రాయలనుకున్నా. ప్రతి యుగంలో కలిపురుషుడిలా ప్రవర్తించేవారు ఉన్నారు. ఒక యుగంలో రావణుడు, మరోయుగంలో దుర్యోధనుడు.. ఇక కలియుగంలో ఎలా ఉంటాడు అనేది చూపించాలనుకున్నా. అతడితో పోరాటం చేయడం చూపించాం. ఈ కథ రాయడానికి 5 సంవత్సరాలు పట్టింది. సైన్స్‌కు మైథాలజీని జోడించి తీశాం. ప్రేక్షకుల స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు.

రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా.. తొలి ఇండియన్ సినిమాగా రికార్డు

ప్రభాస్ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌హాసన్‌ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) అశ్వత్థామగా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని