Naga babu: అప్పుడు ఎలా నడవాలో పవన్‌కు చెప్పా.. ఇప్పుడు తన వెనుకే నడుస్తున్నా: నాగబాబు

Naga babu: వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక సందర్భంగా తీసిన పవన్‌తో కలిసి నడిచి వస్తున్న ఫొటోను నాగబాబు పంచుకున్నారు.

Published : 10 Jun 2023 22:51 IST

హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan).. ఈ పేరు వినపడితే చాలు యువతలో ఎక్కడలేని ఉత్సాహం ఉప్పొంగుతుంది. ఆయన కనపడితే చాలు ‘పవర్‌స్టార్‌’ నామ స్మరణతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోతుంది. అలాంటి పవన్‌కల్యాణ్‌కు ఎలా నడవాలో చిన్నప్పుడు సూచనలు చేసేవాడినని, కానీ, ఇప్పుడు అతడి మార్గంలోనే తామంతా నడుస్తున్నామని ఆయన సోదరుడు నాగబాబు అన్నారు.

వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు పవన్‌కల్యాణ్‌ కూడా హాజరయ్యారు. పవన్‌ను సాదరంగా ఆహ్వానించి, ఆయన వెనుక నాగబాబు నడిచి వస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఇదే ఫొటోను నాగబాబు పంచుకుంటూ.. ‘‘సరైన మార్గంలో ఎలా నడవాలి?ఎలా వ్యవహరించాలి? అని చిన్నప్పుడు పవన్‌కు నేను మార్గనిర్దేశం చేస్తూ ఉండేవాడిని. మేం ఇప్పుడు పెద్దవాళ్లమయ్యాం. పవన్‌ అనుసరించాల్సిన మార్గమేమిటో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇప్పుడు నేను కూడా అతడి అడుగుజాడల్లోనే నడుస్తున్నా’’ అని అంటూ నాగబాబు పేర్కొన్నారు.

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోనూ బిజీగా గడుపుతున్నారు పవన్‌కల్యాణ్‌. రాబోయే ఎన్నికల కోసం జనసైనికులను సమాయత్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ నాయకుడిగా నాగబాబు కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. పార్టీ నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఆయన కూడా పాలు పంచుకుంటున్నారు. ఇక పవన్‌ సినిమాల విషయానికొస్తే.. సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటించిన ‘బో’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌పై ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని