Naga Chaitanya: నాగ చైతన్య, వెంకటేశ్‌ కుమార్తెల ‘వంట’ కబుర్లు

నాగ చైతన్య, వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత కలిసి ఓ ఫుడ్‌ వీడియోలో కనిపించారు. పసందైన వంటల తయారీని చూపించారు.

Published : 05 Dec 2022 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు వెంకటేశ్‌ కుమార్తె ఆశ్రిత (Aashritha Daggubati) ఫుడ్‌ వ్లాగర్‌. ‘ఇన్ఫినిటీ ప్లాటర్‌’ అనే తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా ఆమె ఎన్నో కొత్త వంటలను పరిచయం చేస్తుంటారు. ఈ క్రమంలోనే నటుడు, తన బావ నాగ చైతన్య (Naga Chaitanya)కు సంబంధించిన ఓ క్లౌడ్‌ కిచెన్‌ను చూపించారు. ఆ వీడియోలో.. అక్కడ తయారయ్యే ఆహారం గురించి నాగ చైతన్య వివరిస్తూ, ఆశ్రిత అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిస్తూ కనిపించారు. అనంతరం, ఆశ్రితకు చైతూ అక్కడి ఫుడ్‌ రుచి చూపించారు. ఆ టేస్ట్‌కు ఫిదా అయిన ఆమె చెఫ్‌లను అభినందించారు. వీడియో ప్రారంభంలో.. ‘నా బావ’ అంటూ నాగ చైతన్యను ఆశ్రిత ఆహ్వానించడంపై నెటిజన్లు స్పందించారు. ‘క్యూట్‌’, ‘మీ ఇద్దరిని ఒకే వీడియోలో చూడడం ఆనందంగా ఉంది’, ‘మీ ఫ్యామిలీ నుంచి ఇలాంటి వీడియోలు మరిన్ని ఆశిస్తున్నాం’ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు