Custody: ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘కస్టడీ’ (Custody OTT Release) ఓటీటీ రిలీజ్ సిద్ధమైంది. త్వరలో ఈ సినిమా ప్రైమ్ (Amazon Prime) వేదికగా అందుబాటులో ఉండనుంది.
హైదరాబాద్: నాగచైతన్య (Naga Chaitanya) కానిస్టేబుల్ పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘కస్టడీ’ (Custody). కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. కృతి శెట్టి (Kriti Shetty) కథానాయిక. తెలుగు - తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైంది. కాగా, మరికొన్ని రోజుల్లో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా జూన్ 9 నుంచి అందుబాటులో (Custody OTT Release) ఉండనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రైమ్ ట్వీట్ పెట్టింది. తెలుగు, తమిళంతోపాటు కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
కథేంటంటే:
శివ (నాగచైతన్య) నిజాయతీ గల పోలీస్ కానిస్టేబుల్. సఖినేటిపల్లి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిసుంటాడు. ప్రేమించిన అమ్మాయి రేవతి (కృతి శెట్టి)ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెద్దలు అంగీకరించక పోవడంతో వీరిద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలనుకుంటారు. ఈ క్రమంలోనే శివను ఓ కారు ఢీ కొడుతుంది. అందులో కరుడుగట్టిన నేరస్థుడు రాజు (అరవింద్ స్వామి), సీబీఐ అధికారి జార్జ్ (సంపత్ రాజ్) గొడవ పడుతుంటారు. వాళ్లను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేసి స్టేషన్‌లో పెడతాడు శివ. అయితే ముఖ్యమంత్రి దాక్షాయని (ప్రియమణి) ఆదేశం ప్రకారం స్టేషన్‌లో ఉన్న రాజును చంపేందుకు పోలీస్ కమిషనర్ నటరాజన్ (శరత్ కుమార్) రంగంలోకి దిగుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజును చంపాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించింది? అతన్ని పోలీస్ స్టేషన్ నుంచి ప్రాణాలతో రక్షించిన శివ బెంగళూరుకు ఎందుకు తీసుకెళ్లాలనుకుంటాడు? ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!