
Published : 15 Dec 2021 01:26 IST
Naga Chaitanya: చైతూ వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా?
ఇంటర్నెట్ డెస్క్: నాగచైతన్య- సమంత విడిపోయి రెండు నెలలు అవుతున్నా.. ఏదో ఒక సందర్భంలో ఇప్పటికీ వారి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌లో మాట్లాడానికి ఇష్టపడని నాగచైతన్య తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు?’ అన్న ప్రశ్నకు చైతూ బదులిస్తూ.. ‘‘నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. అయితే అది వ్యక్తిగతంగా, కుటుంబం గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. అలాంటి పాత్ర, కథ నా దగ్గరికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను” అన్నాడు. ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి పరోక్షంగా చేసినవేనంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి
Tags :