Naga Chaitanya: ఆ నటి అంటే నాకెంతో ఇష్టం: నాగచైతన్య

తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ గురించి పెదవివిప్పారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ (Sushmita Sen) అంటే తనకెంతో ఇష్టమని అన్నారు..

Updated : 17 Aug 2022 11:01 IST

‘జీవితాన్ని సీరియస్‌గా తీసుకోవద్దు’

హైదరాబాద్‌: తన ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ గురించి పెదవి విప్పారు నటుడు నాగచైతన్య (Naga Chaitanya). బాలీవుడ్‌ నటి, మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ (Sushmita Sen) అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను బయటపెట్టారు.

‘ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?.. ఏ నటీమణితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలనుకుంటున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘‘నా ఫస్ట్‌ సెలబ్రిటీ క్రష్‌ సుస్మితా సేన్‌. ఆమె అంటే నాకెంతో ఇష్టం. ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు కూడా చెప్పాను. ఇక, ఆలియా భట్‌నీ అభిమానిస్తుంటా. ప్రతి సినిమాలో ఆమె నటనతో అదరగొడుతొంది. కత్రినాకైఫ్‌ అందంగా ఉంటుంది. ప్రియాంక చోప్రా కెరీర్‌నీ స్ఫూర్తిగా తీసుకుంటా. అవకాశం వస్తే ఈ బాలీవుడ్‌ నటీమణులతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉంది’’ అని చైతన్య సమాధానమిచ్చారు.

‘‘ఒకవేళ మీ ఆటోబయోగ్రఫీ రాయాల్సి వస్తే దానికి ఏం టైటిల్‌ పెడతారు?’’ ‘‘మీరు ఒక ఐలాండ్‌లో చిక్కుకుపోతే.. ఆసమయంలో మీతో ఏం ఉండాలని కోరుకుంటారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘నా ఆటోబయోగ్రఫీకి ‘జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దు’ అనే టైటిల్‌ పెడతా. అలాగే ఏదైనా ఐలాండ్‌లో చిక్కుకుపోతే.. నాకెంతో ఇష్టమైన మ్యూజిక్‌ ఉండాలనుకుంటా. నా మనసుకు దగ్గరైన ఓ అందమైన మహిళతో సమయాన్ని గడపాలనుకుంటా. మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటాం’’ అని చైతన్య వివరించారు.

ఇక, ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఆగస్టు 11న పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో చైతన్య కీలకపాత్ర పోషించారు. కరీనా కపూర్‌ కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని