Naga Chaitanya: బీటౌన్‌ నటితో ప్రేమాయణం.. పరోక్షంగా స్పందించిన చైతన్య

ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో నటుడు నాగచైతన్య (Naga Chaitanya) రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలపై చైతన్య స్పందించారు....

Updated : 03 Aug 2022 10:33 IST

సామ్‌తో సినిమా చేయనున్నారా..?

హైదరాబాద్‌: ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో నటుడు నాగచైతన్య (Naga Chaitanya) రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పడింది. తన వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌మీడియాలో వస్తోన్న వార్తలపై చైతన్య స్పందించారు. తనపై జరుగుతోన్న ప్రచారాలు చూస్తుంటే నవ్వొస్తుందని అన్నారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు చైతన్య ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘‘ఈ మధ్యకాలంలో మీ గురించి వచ్చిన ఏ రూమర్‌ చూసి నవ్వుకున్నారు?’’ అని ప్రశ్నించగా.. ‘‘ప్రతివారం నా గురించి ఏదో ఒక రూమర్‌ బయటకువస్తోంది. వాటిని చూస్తే ఫన్నీగా అనిపిస్తోంది. నా జీవితానికి ఎలాంటి సంబంధంలేని విషయాలపైనా ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట వాటిని చూసినప్పుడు నవ్వొచ్చినప్పటికీ.. ఇప్పుడైతే వాటినస్సలు పట్టించుకోవడం లేదు’’ అని చైతన్య వివరించారు. నాగచైతన్య, ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, తరచూ డిన్నర్‌ పార్టీలకు వెళ్తున్నారంటూ ఇటీవల పలు పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో చై లేటెస్ట్‌ ఇంటర్వ్యూతో ప్రేమాయణం వార్తలకు పరోక్షంగా ఫుల్‌స్టాప్‌ పడినట్లు అయ్యింది. ఇక, ఇదే ఇంటర్వ్యూలో సమంతతో(Samantha) మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై చై స్పందిస్తూ.. ‘‘మేమిద్దరం కలిసి నటిస్తామో లేదో నాక్కూడా తెలియదు. కేవలం విధికే తెలుసు. ఒకవేళ మేమిద్దరం కలిసి మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే అది క్రేజీనే అవుతుంది’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని