Naga Chaitanya: నేను ఏదైనా నేరుగా చెప్తా.. ద్వంద్వార్థం ఉండదు: నాగచైతన్య

‘‘నేను ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా. అందులో డబుల్‌ మీనింగ్‌ ఉండదు’’ అని ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు నాగచైతన్య సమాధానమిచ్చారు. ‘ఆ డబుల్‌ మీనింగ్‌ పదాలేంటో నువ్వు చెప్పు’ అంటూ ఆ హోస్ట్‌ని తిరిగి ప్రశ్నించారు.

Published : 05 Jul 2022 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘నేను ఏ విషయాన్నైనా నేరుగా చెప్తా. అందులో డబుల్‌ మీనింగ్‌ ఉండదు’’ అని ఓ యాంకర్‌ అడిగిన ప్రశ్నకు నాగచైతన్య (Naga Chaitanya) సమాధానమిచ్చారు. ‘ఆ డబుల్‌ మీనింగ్‌ పదాలేంటో నువ్వు చెప్పు.. తెలుసుకుంటా’ అంటూ ఆ హోస్ట్‌ని తిరిగి ప్రశ్నించారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘థ్యాంక్‌ యూ’ (Thank You). ఈ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ జులై 22న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘5 సెకండ్స్‌ రూల్‌’ అనే ఓ ఫన్నీ ఇంటర్వ్యూని రూపొందించింది. యాంకర్‌ అడిగిన ప్రశ్నకు 5 సెకన్లలో సమాధానం చెప్పాలనేది దీని ఉద్దేశం. ఇందులో చైతన్య, రాశీఖన్నా (Raashi Khanna) పాల్గొని, సందడి చేశారు. కొన్నింటికి నిర్ణీత సమయంలోనే సమాధానం చెప్పి, మరికొన్నింటికి చెప్పలేక నవ్వులు కురిపించారు. ప్రముఖ కార్ల కంపెనీలు, కుక్కుల జాతులు, గణిత సూత్రాలు, రసాయనాలు, భాషలు.. ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వచ్చిందే ద్వంద్వార్థం  ప్రస్తావన.

దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారు. ఈయన సరసన రాశీఖన్నాతోపాటు మాళవిక నాయర్‌, అవికా గోర్‌ నటించారు. సూపర్‌హిట్‌ చిత్రం ‘మనం’ తర్వాత విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో వస్తుండటంతో ‘థ్యాంక్‌ యూ’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, విక్రమ్‌- చైతన్య కాంబినేషన్‌లో ‘దూత’ అనే వెబ్‌ సిరీస్‌ రూపొందుతోంది. చైతన్య- రాశీ జోడీ ఇంతకు ముందు ‘వెంకీ మామ’ చిత్రంతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని