Naga Chaitanya: చైతూ చిత్రంలో తారా మెరుపులు

నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్, ప్రియమణి శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్నారు.

Updated : 24 Nov 2022 14:45 IST

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా వెంకట్‌ ప్రభు (Vankat Prabhu) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కృతి శెట్టి కథానాయిక. ఈ సినిమాలో అరవింద్‌ స్వామి, శరత్‌ కుమార్, ప్రియమణి శక్తిమంతమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అలాగే సంపత్‌ రాజ్, వెన్నెల కిషోర్, ప్రేమ్‌జీ అమరెన్, ప్రేమి విశ్వనాథ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలియజేసింది. ‘‘కొత్తదనం నిండిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ చిత్రంగా రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో చైతూ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: ఎస్‌.ఆర్‌.కతీర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని