Naga Chaitanya: సమంత ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది: నాగచైతన్య

నాగచైతన్య (Naga Chaitanya).. కానిస్టేబుల్‌ పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘కస్టడీ’ (Custody). వెంకట్‌ ప్రభు దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మాజీ భార్య సమంత (Samantha) గురించి స్పందించారు.

Updated : 11 May 2023 20:22 IST

హైదరాబాద్‌: తన మాజీ సతీమణి, నటి సమంత (Samantha) ఏదైనా అనుకుంటే తప్పకుండా చేసి తీరుతుందని నటుడు నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. ఆమె సంకల్పం గొప్పదని ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇప్పటివరకూ తాను వర్క్‌ చేసిన కోస్టార్స్‌లో నచ్చిన క్వాలిటీస్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో చై మాట్లాడారు.

‘‘పూజాహెగ్డే (Pooja Hegde) స్టైల్‌ అంటే నాకెంతో ఇష్టం. కృతిశెట్టి (Krithi shetty) అమాయకత్వం చూడముచ్చటగా ఉంటుంది. అద్భుతమైన చిత్రాల్లో నటించాలనే తపన తనలో ఉంది. ప్రతిరోజూ సెట్‌కు రాగానే పాత్ర గురించి, సీన్స్‌ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుంది. సాయిపల్లవి (Sai Pallavi) డ్యాన్స్‌ బాగుంటుంది. ఆమె ఉండటం వల్లే ‘లవ్‌స్టోరీ’లో డ్యాన్స్‌ రిహార్సల్స్‌ కోసం ఎక్కువ గంటలు కేటాయించాను. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) మల్టీ టాలెంటెడ్‌. ఆమె పాటలు నాకు నచ్చుతాయి. ఇక, సమంత (Samantha) హార్డ్‌వర్కర్‌. పరిస్థితులు ఎలా ఉన్నా దృఢ సంకల్పంతో ముందుకు అడుగులు వేస్తుంది. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది. ‘మజిలీ’ తర్వాత సామ్‌ నటించిన ‘ఫ్యామిలీమ్యాన్‌’, ‘ఓ బేబీ’ సినిమాలు నాకెంతో నచ్చాయి. ఆమె నటించిన ‘యశోద’ కూడా చూశాను’’ అని చై వివరించారు.

అనంతరం ఆయన సామ్‌ నుంచి విడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘మా మధ్య ఏదైతే జరిగిందో అది దురదృష్టకరం. మేము విడిపోయినప్పుడు ఎన్నో వదంతులు వచ్చాయి. కొంతమంది గాసిప్స్‌ క్రియేట్‌ చేస్తూ వార్తలు రాశారు. వాటిని చూసి ఇబ్బందిపడ్డా. మా గురించి ఎందుకింతలా వార్తలు సృష్టిస్తున్నారు? టీఆర్పీ కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇదంతా అవసరం లేదు కదా అనిపించింది. రోజులు గడిచే కొద్ది వాటిని పట్టించుకోవడం మానేశా. నేను పరిశ్రమలోకి వచ్చింది వృత్తిపరమైన జీవితంతో ప్రేక్షకులను అలరించడానికి.. వ్యక్తిగత జీవితంతో ఎంటర్‌టైన్‌ చేయడానికి కాదు. అలా, నా వృత్తిపై మరింత దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని