Naga Chaitanya: ‘కస్టడీ’.. ఒక కొత్త ప్రయత్నం చేశా: నాగచైతన్య

నాగచైతన్య (Naga Chaitanya) - కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కస్టడీ’ (Custody). వెంకట్‌ ప్రభు దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈనేపథ్యంలోనే తాజాగా ‘కస్టడీ’ సక్సెస్‌మీట్‌ హైదరాబాద్‌లో జరిగింది.

Published : 13 May 2023 21:50 IST

హైదరాబాద్‌: ‘కస్టడీ’ (Custody)తో నటుడిగా ఒక కొత్త ప్రయత్నం చేశానని నాగచైతన్య (Naga Chaitanya) అన్నారు. తన సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనపై తాజాగా జరిగిన సక్సెస్‌ మీట్‌లో చై మాట్లాడారు. ‘‘మా సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమకు ఆనందిస్తున్నా. మేము ఎంతో కష్టపడి చేసిన సీక్వెన్స్‌లకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌, పోలీస్‌స్టేషన్‌లో వచ్చే సింగిల్‌ షాట్‌ ఫైట్‌, క్లైమాక్స్‌లో ట్రైన్‌ ఫైట్‌, ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఒక నటుడిగా కొత్త ప్రయత్నం చేశాను. ప్రేక్షకులు నాకు సపోర్ట్‌ చేశారు’’ అని చైతన్య అన్నారు.

ఆ కనెక్షన్‌ను గుర్తించలేదు - వెంకట్‌ ప్రభు

‘‘మా సినిమా రిలీజైనప్పుడు నేను కొన్ని రివ్యూలు చదివాను. వాటిని చదివాక ఇందులోని ఒక సీక్వెన్స్‌ చాలామందికి అర్థం కాలేదని నాకు తెలిసింది. అదెంటంటే.. ఈ సినిమా ఒక అంబులెన్స్‌ సీన్స్‌తో మొదలవుతుంది. కథ మొత్తం ఆ అంబులెన్స్‌ వల్లే జరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లోనూ అంబులెన్స్‌ సీన్‌ ఉంటుంది. ఆ అంబులెన్స్‌ కనెక్షన్‌ను ప్రేక్షకులు గుర్తుపడతారని అనుకున్నాం. కాకపోతే, ఎవరూ దాన్ని గుర్తించలేదు. ఇప్పుడైనా ప్రేక్షకులు దాన్ని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా.  సింగిల్‌ షాట్‌ ఫైట్‌ సీక్వెన్స్‌ సుమారు నాలుగు నిమిషాలు ఉంటుంది. దాని కోసం మేము ఎంతో కష్టపడ్డాం’’ అని దర్శకుడు వెంకట్‌ ప్రభు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు