Naga chaitanya: నాగ చైతన్య లేటెస్ట్‌ మూవీ అప్‌డేట్‌

‘లవ్‌ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాల తర్వాత నాగ చైతన్య నటించబోతున్న చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చేసింది.

Published : 06 Apr 2022 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘లవ్‌ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాల తర్వాత నాగ చైతన్య నటించబోతున్న చిత్రంపై ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మేరకు ఆయన వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో కొత్త సినిమా చేయనున్నారు. శ్రీనివాస్‌ సిల్వర్‌ స్క్రీన్స్‌ పతాకం పై ఈ సినిమా రానుంది. ఈ విషయాన్ని తెలియచేస్తూ బుధవారం ఉదయం చిత్ర నిర్మాణ సంస్థ ఓ ట్వీట్‌ షేర్‌ చేసింది. యువసామ్రాట్‌తో కలిసి పనిచేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ ప్రాజెక్టు తమకెంతో ప్రత్యేకమైనదని తెలిపింది. నవ్వులు పూయించడానికి సిద్ధంగా ఉండాలంది. నాగ చైతన్య 22వ చిత్రంగా ఇది సిద్ధం కానుంది.  శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని