Thank You: ‘థ్యాంక్‌యూ’ విడుదల ఖరారు

నాగచైతన్య కథానాయకుడిగా... విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్‌యూ’. రాశిఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

Updated : 15 May 2022 09:10 IST

నాగచైతన్య కథానాయకుడిగా... విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్‌యూ’. రాశిఖన్నా, మాళవిక నాయర్‌ కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు  శనివారం ప్రకటించారు నిర్మాతలు. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్‌  కె.కుమార్‌ కలిసి చేసిన చిత్రమిది. ‘‘నాగచైతన్య కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది. ఆయన లుక్‌, నటన  ఆకట్టుకుంటుంది. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. దీనికి సంగీతం: తమన్‌, కథ: బి.వి.ఎస్‌.రవి, కూర్పు: నవీన్‌నూలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు