‘లాల్‌ సింగ్‌’ కోసం లద్దాఖ్‌ వెళ్లునున్న చైతూ

అమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. జూన్‌లో సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్‌ చేయనున్నారు. దీని కోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లడఖ్‌ వెళ్లనున్నారు.

Published : 13 May 2021 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆమిర్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు. కరీనా కపూర్‌ కథానాయికగా నటిస్తోంది. సినిమా ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. జూన్‌లో సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్‌ జరగనుంది. దీనికోసం చిత్రబృందం నెలరోజుల ముందుగానే లద్దాఖ్‌ వెళ్లనుంది.

అక్కడే ఓ హోటల్లో చిత్ర బృందం మకాం వేయనుంది. స్థానికంగా ఉండే కొంతమందిని సినిమా కోసం తీసుకోనున్నారట. సినిమా యుద్ధ సన్నివేశాల కోసం హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్‌’ చిత్ర యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పర్వేజ్ షేక్‌ పర్యవేక్షణలో చిత్రీకరించనున్నారు. నాగచైతన్య కూడా ఈ షెడ్యూల్లోని కీలక సన్నివేశాల్లో పాల్గొననున్నారని సమాచారం. ‘ఫారెస్ట్ గంప్’లోని బెంజమిన్ బుఫోర్డ్ బ్లూ పాత్రనే ‘లాల్‌ సింగ్‌’లో చైతన్య పోషించనున్నారని సమాచారం. చిత్రంలో మోనా సింగ్‌, సల్మాన్‌ఖాన్‌, షారుఖ్ ఖాన్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

1994 హాలీవుడ్‌లో విజయవంతమైన ‘ఫారెస్ట్‌ గంప్‌’కి ఇది రీమేక్‌గా రూపొందుతోంది. ఆస్కార్ విజేత టామ్ హాంక్స్ ప్రధాన పాత్రలో నటించారు. ‘లాల్ సింగ్ చద్దా’ 2019 అక్టోబర్ 31న చంఢీగఢ్‌లో ప్రారంభమైంది. కొవిడ్ మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్‌ 2020 మార్చిలో నిలిపివేశారు. తొలుత ఈ సినిమాని గతేడాది క్రిస్మస్‌కి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాత పలు కారణాల వల్ల ఆలస్యం అయింది. దీంతో 2021 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు చిత్రబృందం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని