Naga Chaitanya: నాగచైతన్య కొత్త చిత్రం.. ప్రారంభం ఎప్పుడంటే..!

అమీర్‌ఖాన్‌తో కలిసి నాగచైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీని తర్వాత నాగచైతన్య

Published : 20 Sep 2022 17:28 IST

హైదరాబాద్‌: ఆమిర్‌ఖాన్‌తో కలిసి నాగచైతన్య నటించిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీని తర్వాత నాగచైతన్య తన 22వ సినిమాను దర్శకుడు వెంకట్‌ ప్రభుతో చేయనున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించనుంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్రబృందం  ఈరోజు విడుదల చేసింది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. నాగచైతన్య కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్‌ చేస్తూ ‘షూటింగ్‌ రేపటి (సెప్టెంబరు 21) నుంచి మొదలుకానుంది’ అంటూ చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేశారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలవ్వనున్న ఈ ద్విభాషా చిత్రానికి ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని